Telangana Christmas Folk Song | Krupakar | R Vidyasagar | Karimnagar

Telangana Christmas Folk Song

బెత్లెహేము గ్రామములోన
క్రీస్తు యేసు జన్మించినాడే
ఆ పశువుల పాకలోన
ప్రభు యేసు జన్మించినాడే !!2!!
సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ
ఆయన కీష్టులైన మనషులకు భూమి మీద సమాదానం!!2!

1) దేవుని స్వరూపము కలిగినవాడై
దాసుని స్వరూపము ధరించుకొని
తన్నుతాను రిక్తునిగా చేసుకొని
ఆకారమందు మనుషుడాయేనే !!2!!
సిల్వ మరణం పొందినంతగా
- తన్నుతాను తగ్గిచ్చుకొనెను !!2!!
మరణమొంది మూడవ దినమునాడు
-మృత్యుజయుడై తిరిగి లేచినాడే!!2!!.....(బేత్లెహేము)

2) ఆయన ఎదుట ప్రతి మోకాళ్లు వంగున్
ప్రతి నాలుక యేసు ప్రభుని ఒప్పుకొనును
అధికంగా ఆయనను హెచ్చించేదం
యేసు నామమునే గొప్ప చేసెదాము!!2!!
పరలోకమునకు వెళ్ళి దూతల మీదను
-అధికారుల మీదను శక్తుల మీదను !!2!!
అధికారం పొందినవాడై
 -దేవుని కుడి పార్శమున ఉన్నాడు !!2!! (బెత్లహెము )